Vemulakota: వేములకోట ఏరువాక పండుగలో సందడి చేసిన అధికారులు, రైతులు!

Vemulakota: ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పొలంలో నాగలి పట్టి దున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 Jun 2026 1:14 PM IST
Vemulakota
X

Vemulakota: వేములకోట ఏరువాక పండుగలో సందడి చేసిన అధికారులు, రైతులు!

వేములకోట: మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామంలో జిల్లా స్థాయిలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రైతులతో కలిసి పొలంలో నాగలి పట్టి దున్నుతూ ఏరువాక పౌర్ణమి సంప్రదాయాన్ని ఆచరించారు. అనంతరం రైతులకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమం రైతుల్లో ఉత్సాహాన్ని నింపగా, సంప్రదాయ వ్యవసాయానికి ప్రతీకగా నిలిచింది. అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story