Kurnool: వైఎస్ఆర్‌సీపీ నిరసన ర్యాలీ పోస్టర్లు ఆవిష్కరణ

Kurnool: కర్నూలులో జులై 28న నిరసన ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్.

V RAMAMOHAN, KURNOOL
Published on: 27 July 2026 5:17 PM IST
Kurnool
X

Kurnool: వైఎస్ఆర్‌సీపీ నిరసన ర్యాలీ పోస్టర్లు ఆవిష్కరణ

కర్నూలు: ఈ నెల 28వ తేదీ(బుధవారం) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే నిరసన ర్యాలీ పోస్టర్లను పత్తికొండ మాజీ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవమ్మ విద్యార్థులు, యువత తో కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా శ్రీ దేవమ్మ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి విద్యార్థులను యువతను వేదిస్తున్నారని విమర్శించారాని.

DSC లో జరిగిన అక్రమాల పైన CBCID విచారణ చేయాలనీ, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనీ.

అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ,కూటమి ప్రభుత్వం యువతకి ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భవిష్యత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

అదేవిధంగా ర్యాలీ లో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయి కుమార్, యువజన విభాగం పత్తికొండ నియోజకవర్గ అధ్యక్షులు N అశోక్ రెడ్డి విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story