Kurnool: పరీక్ష తప్పితే జీవితం పోదు.. పత్తికొండ ఎమ్మెల్యే భావోద్వేగ సందేశం

Kurnool: పదో తరగతి పరీక్షలో ఫెయిల్ అయ్యాననే బాధతో అవంతి ఆత్మహత్య, అవంతి మృతి పట్ల పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.

G Jagadeesh, Pathikonda
Published on: 1 May 2026 1:50 PM IST
Kurnool
X

Kurnool: పరీక్ష తప్పితే జీవితం పోదు.. పత్తికొండ ఎమ్మెల్యే భావోద్వేగ సందేశం

కర్నూలు జిల్లా: పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామంలో జరిగిన దుర్ఘటనపై పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పదవ తరగతి పరీక్షలో విఫలం కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న హరిజన అవంతి కుటుంబానికి ఎమ్మెల్యే గాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

“పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం జీవితంలో ఓటమి కాదు. ఇది కేవలం ఒక దశ మాత్రమే. విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అండగా నిలిచి, వారికి మానసిక ధైర్యం ఇవ్వాలి అని సూచించారు. ప్రతి విద్యార్థి జీవితం ఎంతో విలువైనది. చిన్న చిన్న సమస్యల కోసం ఆత్మహత్య వంటి దుర్దేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉన్నాయి” అని చెప్పారు. మరణించిన అవంతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story