Nandyal: వడ్డెర సత్రంలో తీవ్ర విషాదం ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య!

Nandyal: నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్న పోలీసులు.

Praveen, Regional Coordinator -Ananthapuram
Published on: 25 Aug 2026 11:15 AM IST
Nandyal
X

Nandyal: వడ్డెర సత్రంలో తీవ్ర విషాదం ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య!

Nandyal: శ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓ కుటుంబం ఊరివేసుకొని ఆత్మహత్య. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తింపు, గత నెల 28న ఆటోలో వచ్చి వడ్డెర సత్రంలో రూమ్ 11ను తీసుకున్నట్లుగా సమాచారం3 రోజులుగా బయటకు రాకపోవడం దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన సత్రం నిర్వాహకులు.

తలుపులు తెరచి చూడగా బాత్రూమ్ లో ముగ్గురు మహిళలు,ఫ్యాన్ కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని ఆత్మహత్య. మృతి చెందిన మృతుల వివరాలు సుధాకర్(36)సం,గోగుల ఆదిలక్ష్మి(50)సం,మల్లేశ్వరి(45)సం,శ్రీదేవి(33)సం,మణికంఠ(15)సం ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు.

Praveen, Regional Coordinator -Ananthapuram

Praveen, Regional Coordinator -Ananthapuram

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, అనంతపురం సహా ప్రాంతీయ రాజకీయ, సామాజిక పరిణామాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘రీజినల్ కోఆర్డినేటర్’.

Next Story