Nandyala: ఫైనాన్స్ వేధింపులకు ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం!

Nandyala: ఫైనాన్స్ వేధింపులు తాళలేక మల్యాల గ్రామానికి చెందిన రామసుబ్బయ్య తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 29 July 2026 5:08 PM IST
Nandyala
X

Nandyala: ఫైనాన్స్ వేధింపులకు ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం!

నంద్యాల జిల్లా: పాములపాడు మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.నిన్నటి దినాన ఎర్రగూడూరు వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన కుటుంబం.

నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన రామసుబ్బయ్య(38) కుటుంబం,ఫైనాన్స్ మరియు అప్పుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం, కొన్ని రోజుల క్రితం బొలెరో వాహనాన్ని ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లడంతో తీవ్ర ఒత్తిడిలోనైన రామసుబ్బయ్య,

భార్య మాధవి(34), కూతుళ్లు తేజ(9), అక్షయ(7)తో కలిసి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుటుంబం. గమనించిన స్థానికులు వెంటనే ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు .

కుటుంబసభ్యుల్లో పెద్దమ్మాయి(తేజ) మినహా మిగతా ముగ్గురి పరిస్థితి విషమం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story