Kampamalla: కంపమల్ల లోన్ యాప్ వేధింపులతో కన్న కొడుకును చంపిన తండ్రి

Kampamalla: లోన్ యాప్ అప్పులు, ఆన్‌లైన్ గేమ్స్ వేధింపులతో కన్న కొడుకు వంశీకృష్ణను కర్రతో కొట్టి చంపిన తండ్రి వసంతరావు. కంపమల్లలో విషాదకర ఘటన.

Ramanaiah, Banaganepalle
Published on: 8 July 2026 2:55 PM IST
Kampamalla
X

Kampamalla: కంపమల్ల లోన్ యాప్ వేధింపులతో కన్న కొడుకును చంపిన తండ్రి

కంపమల్ల: కన్న కొడుకు వంశీకృష్ణ (22) ను కర్రతో కొట్టి చంపిన తండ్రి వసంతరావు. డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉన్న వంశీకృష్ణ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ లకు బానిసగా మారి మానసిక స్థితి సరిగా లేక తల్లిదండ్రులను వేధిస్తుండడం తో విసుగు చెందిన కొడుకును కొట్టి చంపిన తండ్రి.

బెంగళూరు లో ఇటీవల బి సి ఎ డిగ్రీ పూర్తి చేసి ఇంటికి వచ్చిన వంశీకృష్ణ. లోన్ యాప్ ద్వారా కుమారుడు అప్పులు చేయడంతో 40 వేల వరకు లోన్ ఆప్పులు కట్టామని తల్లి లీలావతి పేర్కొంటున్నారు.

లోన్ యాప్ వాళ్ళు ఫోన్ చేసి రూ లక్ష రూపాయలు అప్పు కట్టాలని వంశీకృష్ణ కు ఫోన్ చేసిన లోన్ యాప్ ప్రతినిధులు. లోన్ యాప్ ఒత్తిడికి తట్టుకోలేక తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టిన వంశీకృష్ణ.

తండ్రి దాడి చేయడంతో మృతి చెందిన వంశీకృష్ణ లోన్ యాప్ వేధింపులతో తమ కుమారుడు మానసిక స్థితి సరిగా లేక తమపై వేధించేవాడిని తల్లి లీలావతి పేర్కొంటున్నారు. ఒక్కగానొక కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు..

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story