Nandyal: మంటల్లో బెడ్ల షాపు.. నంద్యాలలో భారీ అగ్నిప్రమాదం!

Nandyal: నంద్యాల పద్మావతి నగర్‌లో అగ్నిప్రమాదం. కాటన్ బెడ్ల తయారీ దుకాణంలో చెలరేగిన మంటలు.

R Pavankalyan, Nandyal
Published on: 4 May 2026 11:05 AM IST
Nandyal
X

Nandyal: మంటల్లో బెడ్ల షాపు.. నంద్యాలలో భారీ అగ్నిప్రమాదం!

Nandyal: నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ప్రాంతంలో ఉన్న కాటన్ బెడ్ తయారీ దుకాణంలో ఈరోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అప్రమత్తంగా చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న కాటన్ బెడ్లు మరియు ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. దీంతో గణనీయమైన ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story