Markapuram: మార్కాపురంలో పోలీసుల మెరుపు చర్య.. జేసీబీతో వాగు ప్రవాహాన్ని క్రమబద్ధీకరించిన ఎస్‌ఐ!
Markapuram: మార్కాపురం మండలం వేములకోట వద్ద వాగు ఉధృతిని తగ్గించిన గ్రామీణ ఎస్‌ఐ వేమన.
Markapuram: మార్కాపురంలో పోలీసుల మెరుపు చర్య.. జేసీబీతో వాగు ప్రవాహాన్ని క్రమబద్ధీకరించిన ఎస్‌ఐ!
మార్కాపురం జిల్లా: మార్కాపురం మండలం వేములకోట గ్రామం వద్ద కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వాగు నీరు రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహించింది. వాగు ప్రవాహానికి అడ్డుగా పేరుకుపోయిన చెత్తాచెదారం, కొమ్మలు తదితర వ్యర్థాల కారణంగా నీటి ప్రవాహం మందగించింది.
సమాచారం అందుకున్న గ్రామీణ ఎస్‌ఐ వేమన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం జేసీబీ సహాయంతో వాగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తున్న నీటి ఉధృతి గణనీయంగా తగ్గి, నీరు సాఫీగా ప్రవహించే పరిస్థితి ఏర్పడింది.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. స్థానిక ప్రజలు గ్రామీణ ఎస్‌ఐ వేమన, పోలీసు సిబ్బంది చొరవను అభినందించారు.




