Nandikotkur: నందికొట్కూరులో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 3 July 2026 3:03 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరులో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. పగిడ్యాల మండలం లక్ష్మాపురం అంబేద్కర్ గురుకులం, నందికొట్కూరు హాస్టళ్లు, హాస్టళ్లు స్కూళ్లకు దూరంగా ఉండటంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని గుర్తింపు.

గురుకులంలో వంట సిబ్బందికి జీతాలు, ఫేస్ యాప్ సెలవుల కోత సమస్య.. పరిష్కరిస్తామని హామీ హాస్టళ్లలో 'ఉప్మా' నాణ్యతపై విద్యార్థుల ఫిర్యాదు.. మార్చాలని ఆదేశం. ఏప్రిల్‌లో ఎక్కువ బియ్యం స్టాక్ పెట్టడం వల్ల జూన్‌కి పురుగు పడుతోంది.. అవసరం మేరకే స్టాక్ ఉంచాలని ఆర్డర్.

రేషన్ షాపులు, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీలు, పీఎం మాతృ వందన యోజన ఫుడ్ కమిషన్ పరిధిలోకే. ఆహార సరఫరాలో లోపాలు జరిగితే సుమోటోగా కేసులు, ఫైన్లు, సస్పెన్షన్ చేసే అధికారం కమిషన్‌కు ఉంది "పేద పిల్లల అన్నంలో కక్కుర్తి పడొద్దు.. లంచాలకు ఆశపడకుండా పనిచేయండి".

అనంతరం కోట హైస్కూల్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి, అక్కడి స్టాక్ ను పరిశీలించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి. నందికొట్కూరు ఇద్దరు ఏం.ఈ.ఓ లు సమన్వయంతో ముందుకు పోవాలని సూచించిన చైర్మన్.

అనంతరం కోట హై స్కూల్ హెచ్.ఎం.కౌసల్యబాయి మరియు ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ లకు మార్గదర్శకాలు సూచించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story