Kurnool: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని హర్షకుమార్ డిమాండ్
Kurnool: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేలా చట్టం మార్చాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు.
Kurnool
కర్నూలు: దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ కర్నూలు లో అన్నారు. దళితులు క్రైస్తవ మతంలోకి వెళితే ఎస్సీ హోదా ఉండదని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కు వ్యతిరేకంగా కర్నూలు లో దళిత నాయకులు, న్యాయవాదులు, క్రైస్తవ మతపెద్దలు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా హర్ష కుమార్ మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన కులం పోదని వివక్ష కొనసాగుతుందన్నారు. కావున మతం మారినా దళితులకు ఎస్సీ హోదా ఉండే విధంగా చట్టం మార్చాలన్నారు. ఈకార్యక్రమంలో హర్ష కుమార్ తో పాటు మాజీ మంత్రి మారెప్ప, రాయలసీమ మాల సంఘల జేఏసి చైర్మన్ యాట ఓబులేసు, దినేష్ కుమార్, బంగి శ్రీధర్, మాధవస్వామి, రవిబాబు, రవిరాజు, నాగేష్, మనోహర్, జాన్, కుందా వెంకటేశ్వర్లు, ప్రసాద్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
Next Story




