Kurnool: 500 మంది విద్యార్థులకు దంత పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ!
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో సహస్ర డెంటల్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు.
Kurnool: 500 మంది విద్యార్థులకు దంత పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ!
కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో సహస్ర డెంటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత దంత వైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. కమిషనర్ గారు మరియు RJD గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో డాక్టర్ శిరీషా రెడ్డి, డాక్టర్ సుజిత, డాక్టర్ సాయి భారతి పాల్గొని విద్యార్థులకు దంత ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు దంత పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు, టూత్‌పేస్ట్‌లు మరియు టూత్ బ్రష్‌లు అందజేశారు. విద్యార్థులు ప్రతిరోజూ దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం, క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం వంటి అంశాలపై వైద్యులు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి రిటైర్డ్ తహసీల్దార్లు మురారి శంకరప్ప మరియు గౌడ్ హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ ఉచిత దంత వైద్య శిబిరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మల్లికార్జున, సోమేష్, చిన్న మల్లేష్, సుజాత, గిరిజ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ తెలిపారు.




