Kurnool: చేనేతలకు ఉచిత విద్యుత్ కానుక - కర్నూలు కలెక్టర్ కరపత్రాల విడుదల!
Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం ధృవపత్రాలను పంపిణీ చేశారు.
Kurnool: చేనేతలకు ఉచిత విద్యుత్ కానుక - కర్నూలు కలెక్టర్ కరపత్రాల విడుదల!
కర్నూలు: సంక్షేమం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ఉచిత విద్యుత్ పథకం కు సంబంధించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ అధికారికంగా విడుదల చేశారు. 07 మంది ఉచిత విద్యుత్ పథకం లబ్దిదారులకు ధృవపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం "ఉచిత విద్యుత్ పథకం" ద్వారా చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని, ఈ పథకం ద్వారా ఒక్కొక్క చేనేత కుటుంబానికి నెలకు రూ. 720/- చొప్పున సంవత్సరానికి మొత్తం రూ.8640/- మరియు ఒక్కొక్క పవర్ లూం యూనిట్ నిర్వాహకులకు నెలకు రూ.1800/- చొప్పున సంవత్సరానికి మొత్తం రూ.21,600/- ఆర్థికంగా లబ్ది కలుగుతుందని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ పథకం ద్వారా 2457 చేనేత కుటుంబాలకు మరియు 01 మరమగ్గ కుటుంబానికి లబ్ది కలుగుతుందని తెలిపారు.
ఈ పథకం ద్వారా చేనేత కార్మికులపై విద్యుత్ వ్యయం భారం తగ్గి, వారి జీవనోపాధి మెరుగుపడటంతో పాటు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, గ్రామీణ ఉపాధికి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అలాగే, చిన్న మరియు గృహాధారిత చేనేత కార్మికులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ జి.నాగరాజా రావు, జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి, కర్నూలు & నంద్యాల, శ్రీ వి.నరసింహా రెడ్డి, అభివృద్ధి అధికారి(చే. జౌ) మరియు సహాయ అభివృద్ధి అధికారులు(చే.జౌ), చేనేత కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.




