Nandikotkur: నందికొట్కూరులో పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు
Nandikotkur: ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన నందికొట్కూరులో ఉచిత రేబీస్ వ్యాక్సినేషన్ క్యాంప్. 25 పెంపుడు జంతువులకు టీకాలు. పశుసంవర్ధక శాఖ ఏడీ వరప్రసాద్ పిలుపు.
Nandikotkur: నందికొట్కూరులో పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు
నందికొట్కూరు: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా నందికొట్కూరు ఏరియా వెటర్నరీ హాస్పిటల్ ఆవరణలో ఉచిత రేబీస్ టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ డి. వరప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ (పశుసంవర్ధక శాఖ). ఈ కార్యక్రమానికి పెంపుడు జంతువుల యజమానులు మంచి స్పందన చూపగా, సుమారు 25 పెంపుడు కుక్కలు మరియు పిల్లులకు ఉచితంగా రేబీస్ నిరోధక టీకాలు అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ డి. వరప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ (పశుసంవర్ధక శాఖ) మాట్లాడుతూ, రేబీస్ అనేది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అత్యంత ప్రమాదకరమైన జూనోటిక్ వ్యాధి అని, అయితే ప్రతి సంవత్సరం పెంపుడు జంతువులకు రేబీస్ టీకా వేయించడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. పెంపుడు జంతువుల యజమానులు తమ జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడంతో పాటు వాటి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ భరత్ కుమార్, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ (LSA) మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొని టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఇటువంటి అవగాహన మరియు ఉచిత టీకాల కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపిన అధికారులు.




