Nandyal: డోన్‌లో పెట్రోల్ కష్టాలు.. 3 గంటలకే క్యూ కట్టిన జనం!

Nandyal: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో తీవ్రమైన పెట్రోల్ కొరత. తెల్లవారుజాము నుంచి బంకుల వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజలు.

Bharat Raj, Dhone
Published on: 25 April 2026 7:34 AM IST
Nandyal
X

Nandyal: డోన్‌లో పెట్రోల్ కష్టాలు.. 3 గంటలకే క్యూ కట్టిన జనం!

నంద్యాల జిల్లా: డోన్ పట్టణంలో ఇంధన కొరత మరింత తీవ్రమైంది. పెట్రోల్ కోసం ప్రజలు ఉదయం 3 గంటల నుంచే బంకుల వద్ద క్యూలలో నిలబడి ఎదురుచూస్తున్నారు. ముందుగా వచ్చి గంటల తరబడి వేచిచూసినా సరైన సమయానికి ఇంధనం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాటిల్స్‌తో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు నిరాశ చెందుతూ “మాకు కూడా సమానంగా ఇవ్వాలి” అంటూ డిమాండ్ చేస్తున్నారు. బంకుల వద్ద రద్దీ పెరిగి చిన్నపాటి వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone

Next Story