Dhone: టీఆర్ నగర్‌లో రెండు వర్గాల ఘర్షణ.. భయాందోళనలో స్థానికులు!
Dhone: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని టీఆర్ నగర్‌లో రెండు వర్గాల యువకుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది.
Dhone: టీఆర్ నగర్‌లో రెండు వర్గాల ఘర్షణ.. భయాందోళనలో స్థానికులు!
Dhone: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని టీఆర్ నగర్‌లో రెండు వర్గాల యువకుల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఎరుకలి పవన్, వడ్డే పవన్, బాబ్లూ, రాజు వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు నడిరోడ్డుపై బండలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఘర్షణ సమయంలో ఎరుకలి పవన్ తన చేతిపై ఉన్న ఎమ్మెల్యే కుటుంబానికి సంబంధించిన టాటూను చూపిస్తూ పోలీసులను బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




