Giddalur: గిద్దలూరులో తాగునీటి కష్టాలు రావద్దు.. MPDOలను ఆదేశించిన ఎమ్మెల్యే!
Giddalur: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గంలోని ఆరు మండలాల MPDOలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Giddalur: గిద్దలూరులో తాగునీటి కష్టాలు రావద్దు.. MPDOలను ఆదేశించిన ఎమ్మెల్యే!
Giddalur: గిద్దలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల MPDO లతో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని
అదేవిదంగా నీటి వనరుల స్థితిగతులు, బోర్‌వెల్‌లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్‌ల నిర్వహణపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసి ప్రజలకు నీటిపై ఎటువంటి ఇబ్బందులున్నా వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయలు సందర్శించి సిబ్బంది పనితీరు మెరుగుపడేలా చూడాలని MPDO లకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో 6 మండలాల MPDO లు పాల్గొని మండలాల వారీగా తాగునీటి సరఫరా పరిస్థితులను ఎమ్మెల్యే కు వివరించారు.




