Giddalur: రైటర్ హుస్సేన్ మృతికి న్యాయం జరగాలి.. గిద్దలూరు తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన!

Giddalur: కర్నూలు జిల్లాలో పని ఒత్తిడి తట్టుకోలేక వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్య. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (VRO Association) జిల్లా అధ్యక్షుడు వైపీ రంగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 8 Jun 2026 3:54 PM IST
Giddalur
X

Giddalur: రైటర్ హుస్సేన్ మృతికి న్యాయం జరగాలి.. గిద్దలూరు తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన!

గిద్దలూరు: కర్నూల్ జిల్లాలో పని వత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న గ్రామ రెవెన్యూ అధికారి మహమ్మద్ హుస్సేన్ మృతికి కారణమైన వారి మీద తగు చర్యలు తీరసుకోవాలని గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం మార్కాపురం జిల్లా అధ్యక్షులు YP రంగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు YP రంగయ్య అధ్యర్యంలో గిద్దలూరు తాలూకా కార్యాలయం లో వి ఆర్వో మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి న్యాయం జరగాలని తాసిల్దార్ కార్యాలం ఆవరణలో నిరసనతెలియ జేశారు . ఈ కార్యక్రమంలో రంగయ్య మాట్లాడుతూ మన సహ ఉద్యోగి అయిన మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని, మహమ్మద్ హుస్సేన్ చావుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జిల్లాలలోని జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని. గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ సర్వేయర్లు గ్రామ రెవెన్యూ సహాయకుల పై ఉన్న పని ఒత్తిడిని తగ్గించాలి సింగిల్ లైన్ మానిటరింగ్ సిస్టం ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల. వెంకటరామయ్య, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ.అజయ్ కుమార్, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు బిజ్జం.రాజశేఖర్ రెడ్డి, D.అచ్చయ్య, పప్పుల కొండయ్య, ఆంజనెయలు, ఖాసీంపీరా, వెంకటేశ్వర్లు, ఖాసీంవలి,సిద్దయ్య గ్రామ సర్వేయర్ లు దూదేకుల. ఖాజావాలి, రమేష్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, ప్రవల్లిక, శ్రీకాంత్, వెంకట్రావు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల రాష్ట్ర కార్యదర్శి ఉరఫ్.అంజి నాయకులు అల్లురయ్య తదితరులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story