Kurnool: పెరవలి రంగనాథ స్వామి ఆలయంలో కరెన్సీ నోట్లతో అమ్మవార్ల అలంకరణ!
Kurnool: మద్దికేర మండలం పెరవలి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి, భూదేవి అమ్మవార్లు కరెన్సీ నోట్లతో శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Kurnool: పెరవలి రంగనాథ స్వామి ఆలయంలో కరెన్సీ నోట్లతో అమ్మవార్ల అలంకరణ!
Kurnool: కర్నూలు జిల్లా, మద్దికేర మండలం పెరవలి గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు, శ్రీ భూదేవి అమ్మవారు ఈరోజు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ సందర్భంగా అమ్మవార్లను వివిధ కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలంకరణతో పాటు కరెన్సీ నోట్లతో చేసిన ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది. అమ్మవార్ల దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. అమ్మవార్ల కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.




