Kurnool: ప్రభుత్వ వొకేషనల్ కళాశాల విద్యార్థులకు జిల్లా స్థాయి ఎంపిక!

Kurnool: కర్నూలు నియోజకవర్గ స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ప్రభుత్వ వొకేషనల్ కళాశాల విద్యార్థులు నాసిక ఫతీర్, ఎస్. ఫయాజ్ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 19 Nov 2026 7:01 PM IST
Kurnool
X

Kurnool: ప్రభుత్వ వొకేషనల్ కళాశాల విద్యార్థులకు జిల్లా స్థాయి ఎంపిక!

కర్నూలు: కర్నూలు నగరంలో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమం (Electoral Literacy) లో భాగంగా వ్యాసరచన (Essay Writing) మరియు క్విజ్ (Quiz) పోటీలలో ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందడం అభినందనీయమని కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ తెలిపారు.

ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో SVEEP కార్యక్రమంలో భాగంగా Electoral Literacy Clubs (ELCs) ద్వారా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు కర్నూలు మున్సిపల్ కమిషనర్ శ్రీ ఒబులేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ పోటీలలో ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థులు:

* నాసిక ఫతీర్ – ప్రథమ సంవత్సరం

* ఎస్. ఫయాజ్ – ప్రథమ సంవత్సరం

వీరిలో నాసిక ఫతీర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన Essay & Quiz పోటీలలో మెరిట్ సాధించి, Electoral Registration Officer (ERO) వారి చేతుల మీదుగా Certificate of Merit అందుకున్నారు. ఈ గుర్తింపు విద్యార్థి ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. అలాగే ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణం.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల ప్రక్రియ, పౌరుల బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక అవగాహన కలిగిన పౌరులుగా ఎదగాలని, వివిధ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు.

మెరిట్ సర్టిఫికెట్ పొందిన నాసిక ఫతీర్‌ను, జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించి, రాబోయే పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL