Srisailam: శ్రీశైలం పాతాళగంగ వద్ద వైభవంగా కృష్ణమ్మ నది హారతి!

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక శుక్రవారం సందర్భంగా పాతాళగంగ వద్ద కృష్ణమ్మ నదీమతల్లికి ఆలయ అధికారులు వైభవంగా దశహారతులు సమర్పించారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 14 Nov 2026 10:19 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం పాతాళగంగ వద్ద వైభవంగా కృష్ణమ్మ నది హారతి!

Srisailam: శ్రీశైలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక శుక్రవారం సందర్భంగా పాతాళ గంగలో కృష్ణమ్మ నది హారతి వైభవంగా నిర్వహించారు శ్రీశైల మహా క్షేత్రంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు ఆలయ అధికారులు వైభవంగా నిర్వహిస్తున్నారు.

సాయంత్రం పాతాళగంగ వద్ద కృష్ణమ్మహారతి కార్యక్రమం నిర్వహించబడింది పాతాళ గంగ వద్ద నెల్కొల్పబడిన కృష్ణవేణి నదీమ తల్లికి విగ్రహానికి పూజా అధికారాలు, వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా నిర్వహించారు.

అనంతరం పాతాళగంగ ఘాట్ వద్ద నీటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజాదికాలు, దశహారతులు నదీమతల్లికి పూజాదికారాలు,సారె సమర్పణ,దశహారతులను ఆలయ అధికారులు సమర్పించరు.నదీమతల్లికి ఏకహారతి,నేత్రహారతి,బిల్వహారతి,నాగహారతి,పంచహారతి,సద్యోజాతాది పంచహారతులు,కుంభహారతి,నక్షత్రహారతి,రథహారతి,కర్పూరహారతులు ఇచ్చారు.

లోకకల్యాణార్థమై ప్రతీ సంవత్సరం కార్తికమాసంలో నదీమతల్లికి హారతులను సమర్పించడం జరుగుతోంది ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈఓ ఎం శ్రీనివాసరావు తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM