Markapuram: హరిత ఆంధ్ర దిశగా.. మార్కాపురంలో సీడ్ బాల్స్ తయారీ!

Markapuram: మార్కాపురంలో హరిత ఆంధ్ర లక్ష్యంతో అటవీ శాఖ 'సీడ్ బాల్స్' తయారీని చేపట్టింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 Jun 2026 1:45 PM IST
Markapuram
X

Markapuram: హరిత ఆంధ్ర దిశగా.. మార్కాపురంలో సీడ్ బాల్స్ తయారీ!

Markapuram: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో మార్కాపురం అటవీ శాఖ సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్కాపురంలోని ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో డీఎఫ్‌వో అబ్దుల్ రవుఫ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యానికి అనుగుణంగా మార్కాపురం అటవీ డివిజన్ నుంచి 8 లక్షల విత్తన గోళాలు తయారు చేయనున్నారు. సీఎం, ఉప ముఖ్యమంత్రి పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బందితో పాటు ఎన్జీవోలు, స్థానిక ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు."ప్రతి చేయి పచ్చదనాన్ని విత్తాలి.. ప్రతి హృదయం పచ్చదనాన్ని పెంచాలి.. హరిత ఆంధ్ర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి" అని డీఎఫ్‌వో అబ్దుల్ రవుఫ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు. సీడ్ బాల్స్ ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story