Gudur: గూడూరు మున్సిపల్ ఎన్నికలు: 6 చైర్‌పర్సన్ నామినేషన్లు ఓకే

Gudur: కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవికి 6 నామినేషన్లు, కౌన్సిలర్ వార్డులకు 110 నామినేషన్లు ఆమోదం పొందినట్లు అధికారులు వెల్లడించారు.

C. Ganesh, Kodumuru
Published on: 19 Oct 2026 6:38 PM IST
Gudur
X

Gudur: గూడూరు మున్సిపల్ ఎన్నికలు: 6 చైర్‌పర్సన్ నామినేషన్లు ఓకే

గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవికి దాఖలైన నామినేషన్లలో ఆరు ఆమోదం పొందగా, రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆమోదం పొందిన నామినేషన్లలో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా ఉన్నారు.

*ఆమోదం పొందిన నామినేషన్లు – 6*

1. డమాం సునీతా బాయి – బీజేపీ

2. పుట్టపాశం రామ – వైఎస్సార్‌సీపీ

3. కురుకుండ వెంకటేశ్వరమ్మ – టీడీపీ

4. డమాం సునీతా బాయి – స్వతంత్ర అభ్యర్థి

5. లక్ష్మీనగరం పద్మావతి – వైఎస్సార్‌సీపీ

6. డమాం సునీతా బాయి – బీజేపీ

*తిరస్కరించిన నామినేషన్లు – 2*

1. కురుకుండ వెంకటేశ్వరమ్మ – స్వతంత్ర అభ్యర్థి

2. ఎస్. మహబూబ్ బీ – స్వతంత్ర అభ్యర్థి

కౌన్సిలర్ వార్డులకు 119 మంది అభ్యర్థులు

గూడూరు మున్సిపాలిటీలోని కౌన్సిలర్ వార్డులకు మొత్తం 119 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వాటిలో 9 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 110 మంది అభ్యర్థుల నామినేషన్లు మిగిలాయి.

పార్టీల వారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి

- టీడీపీ – 31 మంది

- వైఎస్సార్‌సీపీ – 34 మంది

- బీజేపీ – 12 మంది

- జనసేన – 5 మంది

- కాంగ్రెస్ – 3 మంది

- ఇతరులు – 29 మంది

వైఎస్సార్‌సీపీ నుంచి అత్యధికంగా 34 మంది అభ్యర్థులు ఉండగా, టీడీపీ నుంచి 31 మంది బరిలో ఉన్నారు. ఇతర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru