Halaharvi: జెడ్పీటీసీ బీజేపీ అభ్యర్థిగా ఎం. వైశాలి – బి-ఫారం పంపిణీ!

Halaharvi: కర్నూలు జిల్లా హాలహర్వి జెడ్పీటీసీ బీజేపీ అభ్యర్థిగా ఎం. వైశాలికి బీ-ఫారం అందజేత. కూటమి నేతల సమన్వయంతో విజయమే లక్ష్యంగా ప్రచారానికి పిలుపు.

Bheemalinga, Aluru
Published on: 27 Oct 2026 5:05 PM IST
Halaharvi
X

Halaharvi: జెడ్పీటీసీ బీజేపీ అభ్యర్థిగా ఎం. వైశాలి – బి-ఫారం పంపిణీ!

హాలహర్వి: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హాలహర్వి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బీజేపీ కిషన్ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎం. బసవరాజు సతీమణి ఎం. వైశాలికి బీజేపీ బీఫామ్ అందజేశారు.

కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ, విట్టా రమేష్, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, నంద్యాల జిల్లా కో ఇంచార్జ్ కాశీ విశ్వనాథ్, ఆలూరు బి ఎల్ ఏ.1 ఎం తిమ్మప్ప, కిషన్ మోర్చా జనరల్ సెక్రెటరీ రమణ యాదవ్, ఆలూరు మండల అధ్యక్షుడు బసవరాజుతో పాటు పలువురు సీనియర్ నాయకుల చేతుల మీదుగా కూటమి నాయకుల సహకారంతో బీఫామ్ అందించడం జరిగింది అనంతరం బీఫాంను జిల్లా పరిషత్ కార్యాలయంలో జత పరచడం జరిగింది.

ఈ సందర్భంగా కూటమి నాయకులందరూ సమన్వయంతో ముందుకు సాగుతూ, అభ్యర్థి ఎం. వైశాలి విజయానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునివ్వాలి. ఎన్డీఏ కూటమి ఐక్యతను చాటుతూ క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎన్నికల ప్రచారంలో సమిష్టిగా పాల్గొని అభ్యర్థి గెలుపునకు బాటలు వేయాలని నాయకులు కోరారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru