Srisailam: వరుస సెలవులతో శ్రీశైలానికి భారీగా తరలివచ్చిన భక్తులు!

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, సోమవారం కావడంతో ఉచిత, శీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 14 Sept 2026 10:22 AM IST
Srisailam
X

Srisailam: వరుస సెలవులతో శ్రీశైలానికి భారీగా తరలివచ్చిన భక్తులు!

Srisailam: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి పెరిగిన భక్తులు వరుసగా సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల కాకుండా కర్ణాటక,మహారాష్ట్ర భారీ సంఖ్యలో తరలివచ్చారు తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

రద్దీతో ఆలయ ఉచిత క్యూ లైన్లు,150 శీఘ్రదర్శనం,300 అతి శీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి సోమవారం కావడంతో క్షేత్రానికి భారీగా తరలి వచ్చిన భక్తులు,భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కోసం ఆర్జిత అభిషేకాలు,స్పర్శ దర్శనాలు,కుంకుమార్చనలు నిలుపుదల చేసిన దేవస్థానం అధికారులు భక్తులందరికీ శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనాలకు అనుమతి ప్రోటోకాల్ సిఫార్సుతో వచ్చే భక్తులకు రాత్రి 8.30 స్పర్శ దర్శనం కల్పించిన దేవస్థానం.

అధికారులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో భక్తులకు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందించేలా ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు ప్రముఖులు సిఫార్సుపై రాత్రి వేళల్లో స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు త్వరగతిన అవుతున్నాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు భక్తుల రద్దీతో సందడిగా మారిన శ్రీశైలం మహా క్షేత్రం.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM