Srisailam: శ్రీశైలంలో భక్తుల రద్దీ.. 4 గంటల పాటు క్యూలైన్లలో భక్తులు!

Srisailam: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 22 Jun 2026 7:28 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో భక్తుల రద్దీ.. 4 గంటల పాటు క్యూలైన్లలో భక్తులు!

Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది పాఠశాలలు ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.

శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు, సామాన్య భక్తులకు ఉచిత,శీఘ్ర, అతిశీఘ్ర, దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

ఆన్లైన్లో విఐపి బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 2 విడతలుగా ఉదయం 7:30 రాత్రి 9 గంటలకు మాత్రమే(BREAK) స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story