Kurnool: తుంగభద్ర నుంచి సుంకేశులకు 12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో!

Kurnool: ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్నూలు జిల్లా సుంకేశుల రిజర్వాయర్‌కు 12,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

C. Ganesh, Kodumuru
Published on: 25 Sept 2026 9:14 PM IST
Kurnool
X

Kurnool: తుంగభద్ర నుంచి సుంకేశులకు 12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో!

కర్నూలు: వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తుంగభద్ర నదికి వరద ప్రవాహం మొదలై కర్నూలు జిల్లా సుంకేశుల రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.

సుంకేసుల రిజర్వాయర్ వివరాలు

ఇన్‌ఫ్లో: 12,000 క్యూసెక్కులు

ఔట్‌ఫ్లో: ప్రస్తుతం నిల్

పూర్తి సామర్థ్యం: 1.2 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ: 0.321 టీఎంసీలు

సుంకేశుల జలశాయానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున రిజర్వాయర్ నీటిమట్టంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru