Nandyal: నంద్యాల జిల్లాలో గాలివాన బీభత్సం.. రోడ్లపై కూలిన భారీ వృక్షాలు!
Nandyal: నంద్యాల జిల్లాలో రాత్రి కురిసిన ఈдуరుగాలుల వాన బీభత్సం సృష్టించింది.
Nandyal: నంద్యాల జిల్లాలో గాలివాన బీభత్సం.. రోడ్లపై కూలిన భారీ వృక్షాలు!
నంద్యాల: జిల్లా లో రాత్రి కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. నంద్యాల పట్టణంతో పాటు మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో భారీ వృక్షాలు నేలకొరిగి పలు వాహనాలకు నష్టం వాటిల్లింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
రాత్రి ఒక్కసారిగా మారిన వాతావరణంతో నంద్యాల లో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి...
రోడ్లపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, కొన్ని ప్రాంతాల్లో వాహనాలపై చెట్లు పడటంతో భారీ నష్టం సంభవించింది. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో భారీ వృక్షం రెండు కార్లపై పడటంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు వెంటనే అప్రమత్తమై కూలిన చెట్లను తొలగించే పనులు చేపట్టారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. మరోవైపు, గత కొద్ది రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.




