Kodumur: కోడుమూరులో కురిసిన భారీ వర్షానికి గణేష్‌నగర్‌లో నిలిచిన నీరు!

Kodumur: కర్నూలు జిల్లా కోడుమూరులో కురిసిన భారీ వర్షానికి గణేష్‌నగర్‌లో నిలిచిన వరద నీరు. డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసుల ఆవేదన.

C. Ganesh, Kodumuru
Published on: 23 Sept 2026 8:06 AM IST
Kodumur
X

Kodumur: కోడుమూరులో కురిసిన భారీ వర్షానికి గణేష్‌నగర్‌లో నిలిచిన నీరు!

Kodumur: కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఎల్‌నినో ప్రభావంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారీ వర్షం కాస్త ఊరటనిచ్చింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.

అయితే భారీ వర్షం కారణంగా పట్టణంలోని గణేష్ నగర్‌లో వర్షపు నీరు రహదారిపై నిలిచిపోయింది. దీంతో కాలనీ వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి గణేష్ నగర్‌లో రహదారి, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru