Markapuram: పుల్లలచెరువులో భారీ వర్షం వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి రక్షణ!
Markapuram: పుల్లలచెరువులో 2 గంటల పాటు భారీ వర్షం. తెల్లగట్ల వాగులో కొట్టుకుపోయిన వాహనదారుడిని జేసీబీతో సురక్షితంగా కాపాడిన ఎస్సై సాంబశివరావు.
Markapuram: పుల్లలచెరువులో భారీ వర్షం వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి రక్షణ!
Markapuram: పుల్లలచెరువు మండలం లో రెండు గంటల పాటు భారీగా కురిసిన వర్షం. దీంతో తెల్లగట్ల వద్ద చప్టాపై నుండి వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఒరిస్సాకు చెందిన సునీల్ కుమార్ బైక్ పై వెళుతూ అదుపు తప్పి పడి వాగులో యాభై మీటర్ల దూరం కొట్టుకొని పోయి చెట్ల మధ్య ఇరుక్కున్నాడు.సమాచారం అందుకున్న ఎస్సై సాంబశివరావు జెసీబీ సహాయంతో చెట్ల మధ్య ఉన్న సునీల్ కుమార్ ను సురక్షితంగా బయటకు తీయించారు.ముటుకుల గుట్లపల్లి మధ్య ఉన్న చిన్న కండ్లేరు వాగు బ్రిడ్జ్ పై నుండి వరదనీరు ఐదు అడుగుల ఎత్తులో ప్రవహిస్తూ ఉండటంతో వాహనాలు ఆగిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
పుల్లలచెరువు లో భారీ వర్షానికి చుట్టూ ఉన్న కాటివీరన్న,రామానాయుడు, చిన్న కండ్లేరు, పేరేడు చెరువులకు భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు.ఇప్పటికే భూగర్భ జలాలు పడిపోయి బోర్లకు నీళ్ళు రాక రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,ఈ భారీ వర్షం తో నీటి కష్టాలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలు చేసుకున్న పూజలకు విఘ్నేశ్వరుడు కరుణించి భారీ వర్షం కురిపించాడని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.




