Nandyal: నందికోట్కూరులో చైర్మన్ పదవికి ముస్లిం మహిళల ముఖాముఖి పోరు!

Nandyal: నందికోట్కూరు మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా చైర్మన్ స్థానానికి ఇద్దరు ముస్లిం మైనారిటీ మహిళలు (మొల్ల సబేరున్నిసా, షేక్ ఫాతిమా బీ) ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 18 Oct 2026 10:07 AM IST
Nandyal
X

Nandyal: నందికోట్కూరులో చైర్మన్ పదవికి ముస్లిం మహిళల ముఖాముఖి పోరు!

Nandyal: నందికోట్కూరు మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చైర్మన్ పీఠం కోసం ఇరు ప్రధాన పార్టీల నుంచి ముస్లిం మైనారిటీకి చెందిన ఇద్దరు బీసీ మహిళలు బరిలో నిలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మున్సిపల్ పరిధిలో మొత్తం 36,700 మంది ఓటర్లు ఉండగా, బీసీ మహిళకు రిజర్వ్ అయిన చైర్మన్ పదవికి ఈసారి ప్రత్యక్ష ఎన్నిక జరగనుండటంతో ఈ సమరం మరింత ఆసక్తిని రేపుతోంది.

నేడు నామినేషన్ల ఘట్టం:

నామినేషన్లకు నేడే చివరి రోజు కావడంతో ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కూటమి అభ్యర్థి - మొల్ల సబేరున్నిసా:

టీడీపీ కూటమి అధిష్టానం అడ్వకేట్ మొల్ల జాకీర్ సతీమణి మొల్ల సబేరున్నిసా ను తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. విద్యావంతుల కుటుంబ నేపథ్యం, న్యాయవాది భార్యగా పట్టణంలో మంచి పలుకుబడి ఆమెకు కలిసొచ్చే అంశం.

వైసీపీ అభ్యర్థి - షేక్ ఫాతిమా బీ:

వైసీపీ నుంచి మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ ల ప్రతిపాదనతో షేక్ ఫాతిమా బీ, w/o షేక్ మన్సూర్ భాష బరిలోకి దిగుతున్నారు. స్థానికంగా బలమైన క్యాడర్, మైనారిటీల్లో పట్టు ఆమెకు బలం.

డ్రైనేజీ సమస్య, తాగునీటి కొరత, రోడ్ల అభివృద్ధి, యువతకు ఉపాధి - ఈ సమస్యలపై ఎవరి విజన్ బాగుందో ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. మొదటిసారి జరుగుతున్న ఈ ప్రత్యక్ష పోరులో నందికోట్కూరు తీర్పు ఎటువైపు ఉంటుందో వేచి చూడాలి.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)