Nandyal: వడ్డెమానులో వెలుగులు నింపిన HMTV కథనం స్పందించిన అధికారులు!

Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం వడ్డెమానులో 4 నెలలుగా వెలగని వీధి దీపాల సమస్యపై HMTV ప్రసారంతో స్పందించి కొత్త లైట్లు ఏర్పాటు చేసిన అధికారులు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 23 Sept 2026 9:09 AM IST
Nandyal
X

Nandyal: వడ్డెమానులో వెలుగులు నింపిన HMTV కథనం స్పందించిన అధికారులు!

Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని వడ్డెమాను గ్రామ దళిత కాలనీలో 4 నెలలుగా వెలగని వీధి దీపాల సమస్యపై HMTV లో వార్త ప్రచురితమైన వెంటనే అధికారులు స్పందించారు. HMTV లో కథనం రావడంతో వెంటనే అప్రమత్తమైన పంచాయతీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కాలనీల్లో కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసి, మరమ్మతులు చేపట్టారు. దీంతో నాలుగు నెలలుగా అంధకారంలో ఉన్న ఎస్సీ, బీసీ కాలనీలు ఇప్పుడు వెలుగులతో నిండిపోయాయి.

వీధి దీపాలు వెలగడంతో రాత్రి వేళల్లో పాములు, తేళ్ల భయం తొలగిపోయిందని, పిల్లలు, మహిళలు, వృద్ధులు ధైర్యంగా బయట తిరుగుతున్నారని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తమ గోడును వెలుగులోకి తెచ్చి, సమస్య పరిష్కారానికి కారణమైన HMTV యాజమాన్యానికి, రిపోర్టర్ కు వడ్డెమాను గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)