Nandyal: కరెంటు స్తంభంపై 12 కేజీల భారీ ఉడుము!

Nandyal: నంద్యాల జిల్లా ఆత్మకూరు హ్యాపీ హోమ్ కాలనీలో విద్యుత్ స్తంభం ఎక్కిన 12 కేజీల అడవి ఉడుము. సురక్షితంగా పట్టుకుని నల్లమల అడవిలో విడిచిపెట్టిన ఫౌండేషన్.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 14 July 2026 11:36 AM IST
Nandyal
X

Nandyal: కరెంటు స్తంభంపై 12 కేజీల భారీ ఉడుము!

Nandyal: ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ.. ఓ అడవి ఉడుము ప్రజల నివాసాల్లోకి ప్రవేశించింది. వచ్చింది ఏదో ఒకవైపు వెళ్లకుండా .. ఏకంగా విద్యుత్ స్తంభం పైకి ఎక్కి కూర్చుంది. దీన్ని గమనించిన ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీప హ్యాపీ హోమ్ కాలనీలో చోటు చేసుకుంది. ఆత్మకూరు శివారు కరివేన డి పౌల్ పాఠశాల నుంచి ఎన్హెచ్ 340 సి. హైవే ను దాటి సాయంత్రం చీకటి పడే వేళల్లో ఓ భారీ ఉడుము హ్యాపీ హోం కాలనీలోకి చొరబడింది. దర్జాగా కరెంటు స్తంభం ఎక్కి కూర్చుంది. దీన్ని గమనించిన కాలనీలోని జక్కం జాన్ సంఘమిత్ర ఎనిమల్ ఫౌండేషన్ కు సమాచారం ఇచ్చాడు.

సుమారు రెండు గంటలసేపు ఈ ఉడుము అక్కడి ప్రజలను భయకంపితులను చేసింది. ఇటీవల ఎల్ నినో ప్రభావం వల్ల నల్లమలలో ఏసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు పెరిగాయి. డీ పౌల్ స్కూల్ వెనుక ముళ్ల పొదలు, గుల్మాల ప్రాంతం నుంచి ఇటీవల కాలంలో ఈ తరహా ఉడుములు, విష సర్పాలు బయటకు వస్తున్నాయి. పెద్ద బల్లి జాతికి చెందిన వారణస్ కొమడో ఎన్సిన్ జాతి ఉడుము విషపూరిత జంతువు కాకపోయినా.. దీని నోటిలోని లాలాజలంలో బ్యాక్టీరియా వల్ల ప్రమాదకర ఇన్ఫెక్షన్లు ఓకే ప్రమాదం ఉంది. సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ ప్రతినిధి ఇస్మాయిల్ ఎట్టకేలకు కరెంటు స్తంభం ఎక్కి హల్చల్ చేసిన 12 కేజీల బరువున్న భారీ గోధుమ వర్ణ ఉడుమును ప్రాణాలతో బంధించి సమీప నల్లమల లో విడిచిపెట్టారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story