Markapur: ప్లాస్టిక్ నిషేధంపై మార్కాపూర్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ!
Markapur: మార్కాపూర్‌లో ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థుల భారీ ర్యాలీ.. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన.
Markapur: ప్లాస్టిక్ నిషేధంపై మార్కాపూర్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ!
Markapur: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మార్కాపూర్ పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కమల జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కమల, గౌతమి, సిద్ధార్థ, వాగ్దేవి జూనియర్ కాలేజీల విద్యార్థులు ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీలో పాల్గొని ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని నినాదాలు చేశారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రోగ్రాం మార్గదర్శకులు గైకోటే వెంకట రవి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో FRO పిచ్చి రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది విద్యార్థులతో కలిసి పాల్గొని ప్రోత్సహించారు. ర్యాలీ విజయవంతానికి సహకరించిన అటవీ శాఖ, మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.“చిన్న మార్పు... పెద్ద ప్రభావం” అనే సందేశంతో నిర్వహించిన ఈ ర్యాలీ పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల చైతన్యాన్ని చాటిచెప్పింది.




