Kanigiri: కనిగిరిలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతికి మద్దతుగా భారీ ర్యాలీ!

Kanigiri: కనిగిరి మున్సిపల్ వైసీపీ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి నామినేషన్ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Guravayya, Kanigiri
Published on: 17 Oct 2026 11:30 AM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరిలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతికి మద్దతుగా భారీ ర్యాలీ!

Kanigiri: వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతికి మద్దతుగా శనివారం కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో పులి శాంతి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివెళ్లారు.

ఈ కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పులి శాంతికి తమ మద్దతు ప్రకటించారు. పార్టీ శ్రేణుల ఉత్సాహంతో ర్యాలీ సందడిగా సాగింది.

ఈ ర్యాలీలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, వై.ఎం. ప్రసాద్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వై. సరితారెడ్డితో పాటు ఆరు మండలాలకు చెందిన మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri