Srisailam: శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ.. క్యూలైన్లలో భక్తులు!

Srisailam: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 3 Aug 2026 9:12 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ.. క్యూలైన్లలో భక్తులు!

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.

స్వామి అమ్మవార్లను మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు.

మనమిత్ర,వాట్సాప్ ఆన్లైన్లో స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు స్పర్శ దశనానికి అనుమతి.

శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో భక్తులకు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందించేలా ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు.

మరోపక్క భక్తులకు త్వరగతిన దర్శనం అయ్యేలా శని,అది, సోమవారాలలో విరామ(స్పర్శ దర్శనాల)లో మార్పులు చేశారు. ఈ మూడు రోజులు ఉదయం వేళలో మనమిత్ర వాట్సప్,ఆన్లైన్ లో స్పర్శ దర్శనం టికెట్స్ ముందస్తుగా పొందిన భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ అలానే ప్రముఖులు సిఫార్సుపై రాత్రి వేళల్లో స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు అలానే ప్రముఖులు మాత్రం క్షేత్రానికి స్వయంగా వస్తేనే ఈ మూడు రోజులలో ఉదయం వేళలో స్పర్శ దర్శనం కల్పిస్తు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు త్వరగతిన కల్పిస్తున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story