Emmiganur: ఎమ్మిగనూరులో భారీగా అక్రమ టపాసులు సీజ్!
Emmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 10 లక్షల విలువైన భారీ టపాసులను పోలీసులు సీజ్ చేశారు.
Emmiganur: ఎమ్మిగనూరులో భారీగా అక్రమ టపాసులు సీజ్!
Emmiganur: ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర కొట్టాల ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంట్లో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 240 బాక్స్ ల టపాసులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న టపాసుల విలువ సుమారు రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
ఈ టపాసులను తమిళనాడులోని శివకాశి, తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతాల నుండి తీసుకువచ్చి నిల్వ ఉంచినట్లు సమాచారం లభించింది. ఈ టపాసులు ఎమ్మిగనూరు పట్టణంలోని షరాఫ్ బజార్‌కు చెందిన వ్యాపారివి గా పోలీసులు గుర్తించారు.
అంతేకాకుండా, షరాఫ్ బజార్‌లోని సదరు వ్యక్తికి చెందిన 'గిఫ్ట్ అండ్ ఆర్టికల్స్' షాప్‌లో కూడా ఎలాంటి అనుమతి లేకుండా నిల్వ ఉంచిన సుమారు రూ. 30 వేల విలువ చేసే 12 సంచుల టపాసులను పోలీసులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వ ఉంచిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.




