Nandyala: మామూలిస్తే ఏమైనా కట్టుకోండి.. సుండిపెంటలో అధికారుల బరితెగింపు!
Nandyala: నంద్యాల జిల్లా సుండిపెంటలో ప్రభుత్వ గృహాలను కూల్చి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు.
Nandyala: మామూలిస్తే ఏమైనా కట్టుకోండి.. సుండిపెంటలో అధికారుల బరితెగింపు!
నంద్యాల జిల్లా: శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో హైకోర్టు ఉత్తర్వులతో భూ ఆక్రమణలపై సర్వే చేపట్టగా మరోవైపు టిడిపి సర్వే కూడా కొనసాగుతోంది.ఎవరు ఎన్ని సర్వేలు చేస్తే మాకేంటి అంటూ భూకబ్జాదారులు లోయర్ టైపు ప్రభుత్వ గృహాలను నేలమట్టం చేస్తున్నారు.ఆంజనేయ స్వామి గుడి వెనక ఒకే ఏరియాలో నాలుగు ప్రభుత్వ గృహాలను కూల్చివేసిన ఇరిగేషన్ శాఖ పట్టించుకున్న పాపానపోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట నుంచి వచ్చిన వారు ప్రభుత్వ లోయర్ టైప్ గృహాలను దర్జాగా నేలమట్టం చేసి పెద్ద పెద్ద బవంతులు నిర్మిస్తున్న సంబంధిత శాఖ స్పందించకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది. మీరు ఏమైనా కట్టుకోండి మా మామూలు మాకు ఇచ్చుకోండి అంటూ అధికారులు మామూలు వసూలు చేస్తున్నట్లు కొందరు బహిరంగానే చర్చించుకుంటున్నారు.
గృహాలను నేలమట్టం చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న పనులను ఆపేందుకు కూడా అధికారులు ముందుకు రావడం లేదంటే ముడుపులు ఏ రేంజ్ లో ముట్టాయని ఆరోపణలు లేకపోలేదు.ఈ విషయమై ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా నోటీసులు ఇచ్చామని చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పందించి అక్రమదారులపై ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసులు నమోదు చేయాల్సిందిగా ప్రజా సంఘా నాయకులు డిమాండ్ చేస్తున్నారు.




