Nandyal: డోన్‌లో టెన్షన్.. ఎమ్మెల్యేకు చెప్పకుండానే ఆఫీస్ ప్రారంభం!
Nandyal: నంద్యాల జిల్లా డోన్‌లో నూతన మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవం రాజకీయ దుమారం రేపింది. స్థానిక ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి
Nandyal: డోన్‌లో టెన్షన్.. ఎమ్మెల్యేకు చెప్పకుండానే ఆఫీస్ ప్రారంభం!
Nandyal: డోన్‌లో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనాన్ని జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించారు. దాదాపు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
అయితే డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డికి సమాచారం లేకుండానే కార్యాలయాన్ని ప్రారంభించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా రిబ్బన్ కటింగ్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ ఘటన డోన్ కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.




