Nandyal: నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వసంతకుమారి నామినేషన్!

Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా ఆర్.వసంతకుమారి నామినేషన్ దాఖలు చేసి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తానన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 18 Oct 2026 5:11 PM IST
Nandyal
X

Nandyal: నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వసంతకుమారి నామినేషన్!

Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థిగా తోగట వీర క్షత్రియ కులానికి చెందిన ఆర్.వసంతకుమారి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.

నందికొట్కూరు పట్టణ అభివృద్ధి,మౌలికవసతుల కల్పన,స్త్రీలకు ప్రత్యేక ఉపాధి కల్పనే తన లక్ష్యం అన్న మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థి ఆర్. వసంత కుమారి.

నందికొట్కూరు పట్టణంలో దాదాపుగా 36,700 ఓటర్లు ఉండగా అందులో 700కుటుంబాలు తోగటవీర క్షత్రియ కుటుంబాలకు చెందిన వారు ఉండటం తమకు కలిసివచ్చే అవకాశంగా ఉందన్నారు.

అటు ప్రధాన పార్టీలు రెండూ మైనారిటీ అభ్యర్థులను పోటీలో ఉంచగా వాటికి ప్రత్యామ్నాయంగా తను నిలబడటం జరిగిందన్నారు.

ఇక ఆర్.వసంతకుమారి భర్త కొరుముట్ల రవీంద్ర గతంలో పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గారు శ్రీ వైష్ణవి డిగ్రీ కాలేజీ అధినేతగా ఉండటం తమకు కలిసివచ్చే అవకాశంగా చెప్పుకొచ్చారు.

నందికొట్కూరు పట్టణ ఓటర్లు తన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని తనకు ఓటువేసి గెలిపిస్తారని కోరుకున్న ఆర్. వసంతకుమారి.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)