Kurnool: ఆలూరు జడ్పీటీసీ ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి బెంగళూరు కిషోర్ జోరుగా ఎన్నికల ప్రచారం. ఆలూరు అభివృద్ధే లక్ష్యంగా ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి.
Kurnool: ఆలూరు జడ్పీటీసీ ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఇండిపెండెంట్ జడ్పీటీసీ అభ్యర్థి బెంగళూరు కిషోర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండలంలోని ప్రజలను నేరుగా కలుస్తూ, తనకు ఒక్క అవకాశం ఇచ్చి జడ్పీటీసీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బెంగళూరు కిషోర్.. గతంలో తన అక్కను ఆలూరు సర్పంచ్‌గా ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. అదే విధంగా తనను కూడా ఆదరించి జడ్పీటీసీగా గెలిపించాలని ప్రజలను కోరారు.
తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఆలూరు మండల ప్రజలతో కలిసి ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మండలంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆలూరు మండల అభివృద్ధికి కృషి చేస్తానని బెంగళూరు కిషోర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇచ్చి ఆదరించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.




