Nandyal: అనాథ మానసిక వికలాంగులకు రెడ్ క్రాస్, మనోబంధు ఫౌండేషన్ చేయూత!

Nandyal: నంద్యాలలో అనాథ మానసిక బాధితులకు రెడ్ క్రాస్, మనోబంధు ఫౌండేషన్ ఆహారం అందించి, మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 3 Aug 2026 11:35 PM IST
Nandyal
X

Nandyal: అనాథ మానసిక వికలాంగులకు రెడ్ క్రాస్, మనోబంధు ఫౌండేషన్ చేయూత!

నంద్యాల: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నంద్యాల జిల్లా శాఖ మరియు మనోబంధు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్లపై అనాధలుగా తిరుగుతూ, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి, వారికి వైద్య సహాయం అందించే కార్యక్రమం చేపట్టారు.

గాంధీ చౌక్, రైతు నగరం మరియు ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ అనాధ మానసిక వికలాంగులను రెడ్ క్రాస్ మరియు మనోబంధు ఫౌండేషన్ ప్రతినిధులు చేరదీసి, ముందుగా నంద్యాల రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌కు తీసుకువచ్చి వారికి ఆహారం అందించారు.

అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం కడప రిమ్స్ మానసిక వైద్య ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు. చికిత్స పూర్తి అయ్యి వారు కోలుకున్న తర్వాత వారి బంధువులను కనుగొని వారికి అప్పగించడం జరుగుతుంది.

ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ శ్రీ దస్తగిరి పర్ల మాట్లాడుతూ, మానసిక వికలాంగులను సమాజం నిర్లక్ష్యం చేయకుండా, వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇలాంటి నిరాశ్రయులు ఎవరైనా నంద్యాల జిల్లాలో కనిపిస్తే వెంటనే రెడ్ క్రాస్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సేవా కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ శ్రీ దస్తగిరి పర్ల, మనోబంధు ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీ సురేష్, శ్రీ కృష్ణారెడ్డి, రెడ్ క్రాస్ వాలంటీర్లు మరియు ఇతర సేవాభావులు పాల్గొన్నారు.

ప్రజలకు విజ్ఞప్తి..

నంద్యాల జిల్లాలో ఎవరూ లేని, రోడ్లపై తిరుగుతూ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అనాధ వ్యక్తులు మీ దృష్టికి వస్తే, వెంటనే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నంద్యాల జిల్లా శాఖకు సమాచారం అందించి వారి ప్రాణాలను, జీవితాలను కాపాడడంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము.

సంప్రదించవలసిన నంబర్లు:

📞 8985770583

📞 9347922901

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ

నంద్యాల జిల్లా శాఖ.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story