Aluru: మీడియాలో ఉనికి కోసమే పవన్ కళ్యాణ్‌పై వైసీపీ విమర్శలు!

Aluru: పవన్ కళ్యాణ్‌పై వైసీపీ విమర్శలను జనసేన ఆలూరు ఇంచార్జ్ తెర్నేకల్ వెంకప్ప తిప్పికొట్టారు. ఆలూరు నియోజకవర్గ తాగునీరు, రోడ్ల అభివృద్ధిపై వెల్లడి.

Bheemalinga, Aluru
Published on: 11 July 2026 11:24 AM IST
Aluru
X

Aluru: మీడియాలో ఉనికి కోసమే పవన్ కళ్యాణ్‌పై వైసీపీ విమర్శలు!

Aluru: పవన్ కళ్యాణ్ పై మీడియాలో ఉనికి కోసం వైసీపీ నేతల విమర్శలు తగవు.

విలేఖర్ల సమావేశం లో జనసేన పార్టీ ఆలూరు ఇంచార్జీ వెంకప్ప.

వైసిపి ఓ చిల్లర పార్టీ అని పత్రికల్లో మీడియాలో ఉనికి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బురదల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తెర్నేకల్ వెంకప్ప అన్నారు.

కర్నూలు జిల్లా ఆలూరు స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ డి ఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరోవైపు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖ ద్వారా గ్రామీణ రహదారులను నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారన్నారు.. గత వైసిపి ప్రభుత్వంలో సమస్యలు ,రోడ్ల దుస్థితి ,త్రాగు నీటి సమస్య కనిపించలేదా అని ప్రశ్నించారు.. ఆలూరు నియోజకవర్గం లో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రహదారులు వేషమన్నారు. త్రాగు నీటి సమస్యకు పరిష్కారం కోసం జోహార పురంలో లో రూ.6.75 కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు..

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వేదవతి ప్రాజెక్టు నిర్మాణం ఎంతో అవసరం అన్నారు. విడతలవారీగా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. త్రాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు జనసేన పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు..ఆలూరు ప్రాంత సమస్యలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తో చర్చించి డిప్యూటీ సీఎం కార్యానికి నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు.

పార్టీను మరింతగా బలపితం చేసేందుకు గ్రామ,మండల,తాలూకా కమిటీలను పూర్తిచేసి స్థానిక సంస్థలకు జనసేన పార్టీని సన్నద్ధం చేస్తామన్నారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రంజిత్,శేఖర్,మున్నా,నందు,మహేష్,మునీర్ పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story