kurnool: ఏపీకి గూగుల్ ఏఐ పండగ విశాఖలో 30 బిలియన్ డాలర్ల భారీ ప్రాజెక్ట్

kurnool: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుపై జనసేన ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ తెర్నేకల్ వెంకప్ప హర్షం వ్యక్తం చేశారు.

G Jagadeesh, Pathikonda
Published on: 6 May 2026 1:58 PM IST
kurnool
X

kurnool: ఏపీకి గూగుల్ ఏఐ పండగ విశాఖలో 30 బిలియన్ డాలర్ల భారీ ప్రాజెక్ట్

కర్నూల్: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాష్ట్రానికి గర్వకారణం ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఏ,ఐ డేటా సెంటరు శంకుస్థాపన జరగడం పట్ల జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ తెర్నేకల్ వెంకప్ప హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దాదాపు 30 బిలియన్ డాలర్ల భారీ పెట్టు బడితో ఈ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుండటం ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి కూడా ఒక గొప్ప ముందడుగు అనిపేర్కొన్నారు.

భారతదేశంలో జరుగుతున్న డేటా సెంటర్ పెట్టు బడుల్లో సుమారు 25 శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం గర్వకారణం అని తెలిపారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్పై విశ్వాసం పెరుగుతోందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు, స్కిల్ డెవలప్మెంట్, ఏ,ఐ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం అవుతాయని తెలిపారు.

అదేవిధంగా డేటా సెంటర్ల నిర్మాణంలో ఎనర్జీ వినియోగం, కూలింగ్ సిస్టమ్స్, కార్బన్ ఉద్గారాల నియంత్రణ వంటి అంశాలు కూడా కీలకమని వివరించారు. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని చెప్పారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా ప్రజలు విశాఖపట్నానికి వచ్చే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

సరైన ప్రణాళికతో అమలు చేస్తే రానున్న5- 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో వేగంగా అభివృద్ధి సాధిస్తుందని వెంకప్ప పేర్కొన్నారు. కొంతమంది ఈ అభివృద్ధిని అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారని, అయితే ప్రపంచ స్థాయి పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నప్పుడు మనం వాటిని స్వాగతించి గర్వించాల్సిన అవసరం ఉందని అన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story