Kurnool: ఈశ్వర్ సోడా సెంటర్, బ్లింక్ ఇట్‌లకు భారీ షాక్ లక్ష జరిమానా!
Kurnool: కాలం చెల్లిన కూల్ డ్రింక్స్, వస్తువులను విక్రయిస్తున్న ఈశ్వర్ సోడా సెంటర్, బ్లింక్ ఇట్ సంస్థలపై జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ చెరో లక్ష రూపాయల జరిమానా విధించారు.
Kurnool: ఈశ్వర్ సోడా సెంటర్ భారీ షాక్.. రూ.2 లక్షల జరిమానా!
కర్నూలు: కర్నూలులో ఎక్స్పైర్ అయిపోయిన కూల్డ్రింక్లను అమ్ముతున్న ఈశ్వర్ సోడా సెంటర్ పై కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ భారీ జరిమానా విధించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారి ఈశ్వర్ సోడా సెంటర్ పై గత నెలలలో ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించే సమయంలో షాప్ లో ఎక్స్పైర్ అయిపోయిన కూల్ డ్రింక్ లను గుర్తించి వాటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కు పూర్తి నివేదిక ఇచ్చారు.
విచారించిన జాయింట్ కలెక్టర్ ఈశ్వర్ సోడా యజమానికి లక్ష రూపాయల జరిమానా విధించారు. మరోవైపు బ్లింక్ ఇట్ లో కాలం చెల్లిన వస్తువులను అమ్మినందుకు బ్లింక్ ఇట్ పైన కూడా లక్ష రూపాయల జరిమానా విధించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ తెలిపారు.
Next Story




