Nandyal: బనగానపల్లె పీజీఆర్ఎస్ లో జేసీ సూరజ్ ధనుంజయ్!
Nandyal: బనగానపల్లె తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పాల్గొన్నారు
Nandyal: బనగానపల్లె పీజీఆర్ఎస్ లో జేసీ సూరజ్ ధనుంజయ్!
నంద్యాల: ప్రతి సోమవారం ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్.
మీడియా సమావేశంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టనున్న పథకాలు ప్రజలకు తీసుకెళ్లడమే తమ లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నామని అలాగే పట్టాదారు పాసు పుస్తకం ప్రతి రైతుకు అందజేయడం జరుగుతుందని అన్నారు.
జూలై నెలలో బనగానపల్లె మండలంలోని అప్పలాపురం, కాపుల పల్లె గ్రామాలలో పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు అందజేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ధనుంజయ్ తెలిపారు
పీజీఆర్ఎస్ లో వచ్చే దరఖాస్తులన్నీ స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.అలాగే రీ సర్వే,ఈకైవైసీ పూర్తిచేసిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ ధనుంజయ్ తెలిపారు ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ లో కొంతమంది మండల అధికారులు హాజరుకావడం లేదని తమ దృష్టికి వచ్చిందని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కార్యక్రమం లో బనగానపల్లె ఆర్డీవో నరేంద్ర నాథ్ రెడ్డి తహసిల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




