Kurnool: నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్.. కర్నూలులో మే 5న జాబ్ మేళా

Kurnool: కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయంలో మే 5న భారీ ఉద్యోగ మేళా. అపోలో ఫార్మసీలో 100 ఫార్మసిస్ట్, ఫార్మా ట్రైనీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 May 2026 5:12 PM IST
Kurnool
X

Kurnool: నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్.. కర్నూలులో మే 5న జాబ్ మేళా

Kurnool: ఇందుమూలముగా తెలియచేయడం ఏమనగా, జిల్లా ఉపాధి కార్యాలయం, కర్నూలు వారి ఆధ్వర్యంలో 05.05.2026 వ తేది మంగళవారం ఉదయం 10.00 గంటలకు జిల్లా ఉపాధికార్యాలయము,కర్నూలు నందు ఉద్యోగమేళా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో Apollo Pharmacy నందు Pharmacist మరియు Pharma trainee/Associate ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. 100 ఖాళీలు ఉన్నాయి. ఇందుకు గాను 10th/Intermediate /Degree/D/B/M Pharmacy పాసైన వారు 18-30 సంవత్సరముల వయస్సు గలవారు అర్హులు.

అభ్యర్థులువారియొక్కవిద్యార్హతలకు సంబందించిన ద్రువపత్రాలు, ఫొటోస్, తీసుకునిరావలెను. ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగ మేళా లో పాల్గొని మీ అర్హతకు తగిన ప్రైవేటు ఉద్యోగం పొందవలసింది గా జిల్లా ఉపాధి అధికారిణి శ్రీమతి పి. దీప్తి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు మీ వివరములను www.ncs.gov.in & https://employment.ap.gov.in నందు రిజిస్టర్ చేసుకోగలరు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story