Aspari: ఆస్పరిలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జేసీ నూరుల్ ఖమర్!
Aspari: కర్నూలు జిల్లా ఆస్పరిలో ఎంపీటీసీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పరిశీలించారు.
Aspari: ఆస్పరిలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జేసీ నూరుల్ ఖమర్!
Aspari: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరిలో ఎంపీటీసీ స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పరిశీలించారు. ఆస్పరిలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జాయింట్ కలెక్టర్, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ పలు అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.




