Pattikonda: పత్తికొండలో జర్నలిస్టుల భారీ ర్యాలీ.. నాలుగు స్తంభాల వద్ద ధర్నా!

Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండలో విలేఖరిపై దురుసుగా ప్రవర్తించిన సీఐ జయన్నను సస్పెండ్ చేయాలని జర్నలిస్టు జేఏసీ, ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చాయి.

M Jagadeesh
Published on: 15 Sept 2026 6:38 PM IST
Pattikonda
X

Pattikonda: పత్తికొండలో జర్నలిస్టుల భారీ ర్యాలీ.. నాలుగు స్తంభాల వద్ద ధర్నా!

పత్తికొండ: జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అర్బన్ సీఐ జయన్నను సస్పెండ్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య,సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి,బిజెపి మండల అధ్యక్షులు కరణం నరేష్,లోక్ సత్తాపార్టీ నియోజకవర్గ అధ్యక్షులు జయరాముడు,జర్నలిస్టు జేఏసీ నాయకులు ఎం.సాల్ రంగడు డిమాండ్ చేశారు.

మంగళవారం జర్నలిస్టు జేఏసీ, ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి నాలుగు స్తంభాల మండపం దగ్గర ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాలాంధ్ర విలేఖరి ఎం.నాగరాజు వార్తా సేకరణ కోసం ఈనెల 11వ తేదీన పోలీస్ స్టేషన్ ఆవరణంలోకి వెళితే సిఐ.జయన్న దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మెడపట్టి బయటకు గెంటివేయడాన్ని తీవ్రంగా ఖండించారు.జర్నలిస్టులు సమాజంలో జరిగే మంచి చెడులను పత్రికల రూపంలో ప్రజలకు తెలియజేస్తారన్నారు.

సీఐ జయన్న తన స్థాయిని మరిచి జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ పత్రికలలో రాయలేని విధంగా నానా దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.జిల్లా పోలీసు అధికారులు జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి సీఐ జయన్న పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టు జేఏసీ నాయకులు ఎం.రంగన్న, ఎం.రాముడు,సురేష్,సుల్తాన్,ఓబులేసు, రంగన్న,లక్ష్మీనారాయణ,పక్కీరప్ప, హనుమంతు,మధుబాబు,మధు గౌడ్, మంజునాథ్,షేక్షావలి,షఫీ,సుధాకర్,నాగేంద్ర.విజయ్,భార్గవ్,ఇమామ్,శివ,గౌస్,శివ శంకర్, బద్రీనాథ్,జాఫర్,మనోహర్,నరేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్,

డి.రాజా సాహెబ్,చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కారన్న,ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి సురేంద్ర కుమార్,పట్టణ కార్యదర్శి రామాంజనేయులు,తుగ్గలి మండల కార్యదర్శి సుల్తాన్,వెంకటేశ్వర్లు,పట్టణ కార్యదర్శి రామాంజనేయులు,సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర,ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి హేమంతు,ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

M Jagadeesh

M Jagadeesh