Markapur: నెక్కంటి అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీకి బ్రేక్

Markapur:మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నెక్కంటి రేంజ్ పరిధిలో జంగిల్ సఫారీ రైడ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది.

Srikanth Singam, Markapur
Published on: 1 July 2026 1:32 PM IST
Markapur
X

Markapur: నెక్కంటి అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీకి బ్రేక్

Markapur: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నెక్కంటి రేంజ్ పరిధిలో యాత్రికులకు నిర్వహిస్తున్న జంగిల్ సఫారీ రైడ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. పులుల సంయోగ కాలం (మేటింగ్ సీజన్) ప్రారంభమైన నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెక్కంటి రేంజ్ అధికారి హరి తెలిపారు.

జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు మూడు నెలల పాటు నెక్కంటి రేంజ్ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇష్టకామేశ్వరి ఆలయం మార్గం, తుమ్మల బైలు ప్రాంతాల్లో నిర్వహించే జంగిల్ సఫారీ రైడ్‌లు పూర్తిగా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఈ కాలంలో అడవిలో మానవ సంచారం తగ్గించడం ద్వారా పులులు, ఇతర వన్యప్రాణులు ప్రశాంత వాతావరణంలో సంచరించే అవకాశం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం పులుల సంయోగ కాలంలో ఇదే విధంగా ఆంక్షలు అమలు చేస్తుంటామని, వన్యప్రాణుల సంరక్షణకు భక్తులు, పర్యాటకులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ నెల నుంచి పరిస్థితులను సమీక్షించి తిరిగి జంగిల్ సఫారీ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనానికి, తుమ్మలబయలు వద్ద జంగిల్ సఫారీ కి మూడు నెలల పాటు తాత్కాలిక విరామం ఉంటుందని అటవీశాఖ అధికారి హరి తెలియజేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story