Jupadubangla: మహిళల భద్రతే లక్ష్యం: జూపాడుబంగ్లాలో ‘శక్తి’ యాప్‌పై పోలీసుల అవగాహన!

నంద్యాల జిల్లా జూపాడుబంగ్లాలో మహిళల భద్రతపై సీఐ సుబ్రహ్మణ్యం అవగాహన కల్పించారు. శక్తి యాప్ ఇన్‌స్టాలేషన్, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 మరియు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లపై 200 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 8 May 2026 9:03 PM IST
Jupadubangla: మహిళల భద్రతే లక్ష్యం: జూపాడుబంగ్లాలో ‘శక్తి’ యాప్‌పై పోలీసుల అవగాహన!
X

జూపాడుబంగ్లా: నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాలు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ సూచనల మేరకు జూపాడుబంగ్లా మండలంలో శుక్రవారం మహిళల అవగాహన సదస్సు నిర్వహించారు.

నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, జూపాడుబంగ్లా ఎస్ఐ మల్లికార్జున పర్యవేక్షణలో వైఎస్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. సదస్సుకు డిప్యూటీ తహసీల్దార్ నాగన్న, ఏపీఎం అంబమ్మ, ఎంపీపీ నీలమ్మ, జిల్లా మహిళా కోఆర్డినేటర్ షాజహాన్, సీపీఐ నేత రమేష్‌తో పాటు పొదుపు మహిళలు, రైతులు, గ్రామ నాయకులు సహా సుమారు 200 మంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ గురించి వివరించారు. ఆపద సమయంలో 7993485111 నంబర్‌కు లేదా యాప్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. బాల్యవివాహాలు, చిన్న పిల్లలపై నేరాలు జరిగితే 1098కు ఫిర్యాదు చేయాలన్నారు. ఎమర్జెన్సీలో 112, 100కు, సైబర్ నేరాలు జరిగితే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్‌లో వచ్చే అనుమానిత లింక్స్ ఓపెన్ చేయవద్దని, వాటి ద్వారా ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాల్యవివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. వన్ స్టాప్ సెంటర్ ప్రాముఖ్యతను వివరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారందరి మొబైల్స్‌లో శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించి, ఆపద సమయంలో దానిని ఎలా ఉపయోగించాలో ప్రత్యక్షంగా చూపించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story